చంద్రగ్రహణం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు ఆటంకం కలిగింది. వాంఖడే స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారత జట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే, సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం ప్రభావం ఉండటంతో, ప్రాక్టీస్ సెషన్‌ను గంట సేపు వాయిదా వేశారు. గ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భారత జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.