MP Nandigam Suresh: టీడీపీ నుండే ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రమాదం
తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Tadikonda legislator Dr Vundavalli Sridevi)కి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే అది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి మాత్రమేనని వైసీపీ లోకసభ సభ్యులు (YCP MP) నందిగం సురేష్ (Nandigam Suresh) సంచలన వ్యాఖ్యలు చేసారు.
తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Tadikonda legislator Dr Vundavalli Sridevi)కి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే అది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి మాత్రమేనని వైసీపీ లోకసభ సభ్యులు (YCP MP) నందిగం సురేష్ (Nandigam Suresh) సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీదేవికి (MLA Vundavalli Sridevi) టీడీపీ నుండి ప్రమాదం ఉందని, తద్వారా ఆ నిందలను తమ పైన మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం దిగజారే చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వల్లే శ్రీదేవికి హానీ ఉందన్నారు. ఆమె తన నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తే నిరభ్యంతరంగా వెళ్లవచ్చునని, వైసీపీ నుండి ఎలాంటి హానీ ఉండదని హామీ ఇచ్చారు. వైసీపీ మహిళలను గౌరవించే పార్టీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) శ్రీదేవి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (TDP MLC panchumarthi anuradha) ఓటు వేశారని ఆరోపించారు. తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని, నిరూపించాలని ఆమె సవాల్ చేస్తున్నారని, తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ చెప్పారు. దళిత ఎమ్మెల్యే అయినందుకు తనను వైసీపీ టార్గెట్ చేస్తోందని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదని, మీరు తప్పు చేసి, కులానికి, పనికి సంబంధం అంటగడతారా అని నిలదీశారు.
శ్రీదేవి నిజంగా తప్పు చేయకుంటే ధైర్యంగా నిలబడవచ్చునని, కానీ మూడు రోజుల తర్వాత హైదరాబాద్ లో ఎందుకు మాట్లాడారో చెప్పాలన్నారు. ఇది టీడీపీ స్క్రిప్ట్ కాదా అని నిలదీశారు. జగన్ చాలా గొప్ప వ్యక్తి అని మీడియాతో చెప్పిన శ్రీదేవి, ఆయనను ఎందుకు మోసం చేసిందో చెప్పాలన్నారు. శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవమని, క్రాస్ ఓటింగ్ చేయలేదని ప్రమాణానికి సిద్ధమా అన్నారు. లేదంటే క్రాస్ ఓటింగ్ చేశారని నిరూపించేందుకు సిద్ధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఓటు అమ్ముకోవడం వాస్తవం అన్నారు. ఎవరితో, ఎక్కడ, ఎలా రాయబారాలు చేసిందో తమకు తెలుసునని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే అందుకు సజ్జల బాధ్యత వహించాలని శ్రీదేవి చెబుతున్నారని, కానీ టీడీపీ నుండే అలాంటిది ఉంటుందని గుర్తించాలన్నారు.