SKLM: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆదివారం మంత్రి తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు, అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు,తాగునీరు పథకం అమలులో ఎక్కడా ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇందులో ఆర్డీవో కృష్ణమూర్తి, అధికారులు సుదాకర్, తదితరులు పాల్గొన్నారు.