NZB: ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని లేదంటే చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరారు.