NDL: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ బుధవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. దేవస్థానం అతిథి గృహం వద్ద ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఇవాళ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట కమిషన్ సభ్యుడు గౌతం, తదితరులు ఉన్నారు.