ASF: కెరమెరి మండలం పరంధోలి, ముకదంగూడా గ్రామపంచాయతీల్లో NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ చొరవతో శనివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించవచ్చన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు.