జనగామ జిల్లాలో ఇసుకను పారదర్శకంగా, వేగంగా అందించేందుకు రూపొందించిన ‘ఈ-సాండ్ బుకింగ్ పోర్టల్’ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సూచించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం, ప్రజలకు సులభంగా ఇసుక సరఫరా చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ విధానం ద్వారా సేవలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.