JGL: రైతులు వానకాలం-2026 నుంచి యూరియా బస్తాల కోసం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని మల్యాల మండలం మానాల క్లస్టర్ ఏఈవో బియ్యాల వరుణ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రైతు గుర్తింపు కార్డు పూర్తి చేసిన వారి ఫోన్ నంబర్లు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యాయని చెప్పారు. ఇంకా నమోదు చేయని రైతులు వెంటనే మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.