E.G: రాజానగరం మండలం రాథేయపాలెంలో ఇంటి సరిహద్దు వివాదం ముదిరి అన్నదమ్ములు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. లావేటి రామారావు, వెంకట్రావు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో సీతమ్మ, వెంకట్రావు, నానికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.