KDP: మైదుకూరు(M) అక్కులాయపల్లెకు చెందిన మహిళలు గురువారం కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అటవీ ప్రాంతంలో కర్రదబ్బలు సేకరించి గంపలు అల్లుతూ జీవనం సాగిస్తున్న తమను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపుల కారణంగా తమ జీవనాధారం దెబ్బతింటోందని పేర్కొన్నారు.