ASR: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ జూన్ 9న అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్సయ్య తెలిపారు. డుంబ్రిగుడలో గురువారం జరిగిన మండల శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.