సత్యసాయి: సంప్రదాయ వడ్డెర వృత్తిదారుల జీవనోపాధి పరిరక్షణకై గుడిబండ మండలంలోని KGN పాళ్యం, కొంకల్లు, గుడిదేహళ్లి గ్రామాల్లో క్వారీ ప్రాంతాలను గుర్తించి క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్నట్లు జిల్లా గనుల శాఖ అధికారి Sk. అమీర్ బాషా తెలిపారు. ఇక్కడ పనిచేసే 25 మందితో నూతనంగా సొసైటీలను రిజిస్ట్రేషన్ చేయించుకుని క్వారీ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.