ప్రకాశం: ఎండల తీవ్రతకు కొండేపి సబ్‌స్టేషన్‌లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంగళవారం సాంకేతిక సమస్య ఏర్పడిందని విద్యుత్ శాఖ ఏఈ హరిదీష్ తెలిపారు. ఈ సమస్యతో కొండపి, పరిసర ప్రాంతాల పరిధిలో విద్యుత్తుకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడునున్నట్లు తెలిపారు. విద్యుత్ సిబ్బంది సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామని విద్యుత్ వినియోగదారులు గమనించాలని వారు తెలిపారు.