BPT: డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఐసీడీఎస్ అధికారులు పేర్కొన్నారు. యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ‘కిశోర వికాసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీడీపీవో జీ. సుభద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ సీహెచ్. సుజాత హాజరయ్యారు.