SDPT: చేర్యాల పట్టణ కేంద్రంలోని గుర్జకుంట వెళ్లే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.