AKP: గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీలో కొందరు తప్పుడు ధృవపత్రాలతో పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదుపై ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జోగంపేట సచివాలయంలో విచారణ నిర్వహించారు. విచారణకు హాజరు కావాల్సిన ఐదుగురిలో ముగ్గురు మాత్రమే హాజరుకాగా, ఫిర్యాదుదారులు గైర్హాజరయ్యారు. దీంతో విచారణను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశామన్నారు.