MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట గచ్చు బావి వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రక్తదాతలను అభినందించి, సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.