NZB: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము 2025-26వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలోని 98,313 కుటుంబాలలోని 1,38,596 కూలీలకు 23 లక్షల పని దినాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించి రూ.61 కోట్ల 32 లక్షలను కూలీల ఖాతాలలో జమ చేయడం జరిగిందని వివరించారు.