JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ రోడ్ వద్ద కౌలు రైతు పొలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నీల గట్టయ్యకు చెందిన 10 HP మోటార్లు, పైప్లైన్, డ్రిప్ సామాగ్రి దగ్ధమై సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది అని బాధిత రైతు తెలిపారు.