SS: హిందూపురం రూరల్ మండలం గోళాపురం గ్రామంలో టీడీపీ, వైసిపి నాయకుల ఘర్షణ నేపథ్యంలో హిందూపురం సబ్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీకి చెందిన బాలప్ప, శివప్పలను ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. నియోజకవర్గ ముఖ్య నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి, జిల్లా కార్యదర్శి గోళాపురం తిప్పేరుద్రయ్య తదితరులు జైలుకు వెళ్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పారు.