NGKL: మార్చాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కల్వకుర్తి క్యాంపు కార్యాలయంలో గ్రామ నాయకులతో సమావేశమైన ఆయన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన భారతమ్మ, చల్మారెడ్డితో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.