MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ శివారులో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంప్ సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఘనపూర్ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి డంపు చేసినట్టు వివరించారు. మంగళవారం అక్రమ ఇసుక డంపు సీజ్ చేసి పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్కు అప్పగించినట్లు వివరించారు. దాడుల్లో జీపీవో నాగరాజు పాల్గొన్నారు.