TPT: సూళ్లూరుపేటలో మాజీ MLA సంజీవయ్య ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు SIRపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి, MP గురుమూర్తి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాపాడాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలకు అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.