ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణ మంగళవారం 23వ వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ వాక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ ముస్తఫా పాల్గొన్నారు. వార్డులోని వివిధ సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ పాడైపోయి ఉన్నచోట నూతన డ్రైన్ల నిర్మాణం, ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం పెరిగిపోవడాన్ని పరిశీలించారు.