TG: తనపై విమర్శలు చేస్తున్న నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటరిచ్చారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశామని, తమ పార్టీకి తెలంగాణపై ప్రేమ రాజకీయాలకు అతీతమైనదని, ఇవాళ ప్రత్యేకంగా పెంచుకున్న ప్రేమ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ నలుమూలలా తాను తిరిగానని, ఇవాళ తనను విమర్శించే నాయకులు ఎవరూ తిరగని ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడినట్లు చెప్పారు.