MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్‌కు చెందిన విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగి చిత్తారి బిక్షపతి (50) మృతి చెందారు. ఆయన మనోహరాబాద్ నుండి తూప్రాన్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైవేపై వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిక్షపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.