HYD: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ డివిజన్లో జాతీయ పతాకాన్ని బండారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించి, ఉద్యమకారుల త్యాగాలను స్మరించారు. జూన్ 2 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.