AP: CM చంద్రబాబు తుని పర్యటనపై YCP నేత చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శలు గుప్పించారు. తునిలో CM నాటకం ఆడారని, గీత కార్మికులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాటి వనాల కోసం 5 ఎకరాలు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. కూటమి నేతలు కులాలను మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప, కుల వృత్తుల కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు.