PLD: గృహ నిర్మాణ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,357 కోట్లు కేటాయించడం శుభపరిణామమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న సీఎం నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతిపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.