SRCL: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించి ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.