AP: ప్రజలు ఛీకొట్టినా YCP నేతలు అరాచక స్వభావాన్ని మార్చుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో కల్లోలమే అజెండాగా గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని, నంద్యాలలో సొంత పార్టీ కార్యకర్తతోనే YSR విగ్రహాన్ని ధ్వంసం చేయించడం అందులో భాగమేనని ఆరోపించారు. ఈ ఘటనను TDPపై నెట్టాలని ప్రయత్నించిందని, నిజం తెలియడంతో షాకైందన్నారు. YCP పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.