KNR: నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. ప్రశాంత్ రెడ్డిని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన స్థాయిల పెంపు, పాఠశాలల సమర్థ నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.