అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని ముక్కావారిపల్లి APSWR స్కూల్ నందు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు స్వచ్ఛంద కార్పొరేషన్ టీమ్ సోమవారం స్థలం పరిశీలించారు. స్కూల్లోనే వ్యర్థాల ద్వారా గ్యాస్ తయారీ విధానాన్ని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో M.V.N రాజేంద్ర, RWS AE సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్, స్కూల్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.