సత్యసాయి: అర్జీలను ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా త్వరితగతిన నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, డిఆర్వో కొండయ్యతో కలిసి 237 అర్జీలు స్వీకరించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.