ATP: కూటమి ప్రభుత్వ నేతలు జగన్ పై వ్యక్తిగత విమర్శలు మానుకొని పాలనపై దృష్టి సారించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి హితవు పలికారు. నార్పలలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడి ఇవ్వలేదని ఆయన విమర్శించారు.