BHNG: భువనగిరి మండలం వడాయిగూడెం(రాయగిరి) సర్వే నెం.518 లో దశాబ్దాలుగా ఉన్న పేదల ఇళ్లను, ప్రభుత్వ భవనాలను నిషిద్ధ జాబితా (22-ఏ) నుండి వెంటనే తొలగించాలని సర్పంచ్ నీల శిరీష డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పేద ప్రజల హక్కులను కాపాడాలని, ఈ భూములను క్రమబద్ధీకరించి వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు.