NRPT: జిల్లా కలెక్టరేట్లో రేపు నిర్వహించే జాతీయ జెండా ఆవిష్కరణ సెరిమోనియల్ గార్డ్ రిహార్సల్స్‌ను అదనపు ఎస్పీ రియాజుల్ హక్ సోమవారం పరిశీలించారు. జూన్ 2న జరిగే ప్రధాన వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణతో కూడిన పరేడ్ ప్రదర్శన ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.