KNR: చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిగ్రాని సమితి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంఈవో మమత పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. పంట అవశేషాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని, కాల్చితే భూ సారం క్షినిస్తుందని, పైగా జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం పంట సమాయత్తం, విత్తనాలు కొనుగోలు గురించి వివరించారు.