గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన, సంతృప్తికరంగా పరిష్కరించి ఉత్తమ పోలీస్ సేవలు అందించడమే కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 160 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వెల్లడించారు.