TPT: రైతు జీవితాలు, వ్యవసాయ సమస్యలను ప్రతిబింబించే ‘మట్టి మనిషి’ నాటకాన్ని జూన్ 5న సాయంత్రం 5:45 గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ రచయిత్రి డా. వాసిరెడ్డి సీతాదేవి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ నాటకాన్ని ప్రజానాట్యమండలి, సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు.