NLG: ఇండియన్ ఆర్మీ తాజాగా విడుదల చేసిన అగ్నివీర్ ఫలితాల్లో నల్గొండ ఎన్జీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఎంపికయ్యారు. కళాశాలకు చెందిన కె. మహేష్, కె. గణేష్, ఎస్. జయప్రకాష్, పి. అనిల్, కె. మనోజ్‌కుమార్ కఠినమైన శారీరక, రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభకనబరచి విజయం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ అభినందించారు.