PPM: కురుపాం–మూలిగూడ ప్రధాన రహదారిపై చింతలపాడు సమీపంలో గత వారం కురిసిన వర్షాలకు భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. వృక్షం తొలగించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ మార్గంలో నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించాలని కోరుతున్నారు.