మంచిర్యాల: జన్నారం మండలంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశామని సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో పీఎసీఎస్ ద్వారా 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తి కావడంతో కొత్తపేట, కవ్వాల్, బంగారు తండా, కామన్పల్లి, రేండ్లగూడ, తపాలాపూర్ లలో కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు.