KDP: మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన ఎద్దుల జయమ్మ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. గత నెల 29న కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయి నట్లు తెలిపారు. బంధువులు, తెలిసిన వారి దగ్గర గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుమా రుడు ఎద్దుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.