NLG: తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జర్నలిస్టులు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన గడియారం సెంటర్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.