TG: జగిత్యాల మండలం మోరపెల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నివేష్, అశ్విన్, అరుణ్ అనే యువకులు థార్ కారులో ఫోన్లో IPL ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రయాణించారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ బావిలో మునిగి మృతిచెందాడు. నివేష్, అశ్విన్ బయటపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అరుణ్ మృతదేహాన్ని, కారును బయటకు తీశారు.