గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో రైల్వే స్టేషన్ మాస్టర్ ఎస్.వెంకటప్ప పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వెంకటప్పను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటప్ప తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో గద్వాల ప్రాంత ప్రయాణికులకు ఎనలేని సేవలు అందించాలని కొనియాడారు.