KNR: రెండు రోజుల పాటు తిమ్మాపూర్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో 346 మంది కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర, జిల్లా నేతలు మార్గనిర్దేశం చేశారు. ముగింపు సభలో విద్యాసాగర్ రావు శిక్షణను ఆచరణలో పెట్టి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.