TG: BRS పార్టీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు రాలేదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెడుతున్నానని.. పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరమన్నారు. సొంతంగా పార్టీ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. పిడికెడు మందితోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మారుతానన్నారు.