AP: అప్పుల్లో ఉన్న విద్యుత్ వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో తొలిసారి 13 పైసలు ట్రూడౌన్ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.1.5కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. యూనిట్ కొనుగోలు ధరను రూ.6.35ను తగ్గించి రూ.340 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు.